పలు మలుపుల మధ్య అయోధ్యలో రామమందిర నిర్మానం జరిగి ప్రారంభోత్సవానికి శ్రీకారం జరుగుతోంది. దశాబ్దాలుగా కచ్చితంగా చెప్పాలంటే శతాబ్దం పైగా ఎన్నో వివాదాలకు కారణమైన అయోధ్య చరిత్ర ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అయోధ్య విష్ణుమూర్తి ఏడవ అవతారమైన రాముడి చరిత్రతో సన్నిహిత సంబందంకలిగి ఉన్న ప్రాంతంగా చెప్తారు. రామాయణము ను అనుసరించి ఈ నగరం 9 వేల సంవత్సరాలకు పూర్వం వేదాలలో మొదటి పురుషుడిగా హిందువులకు ధర్మ శాస్త్రం అందించినట్లుగా పేర్కొన్న మనువు చేత స్థాపించబడింది. మరికొన్ని ఆధారాలను బట్టి ఈ నగరం సూర్యవంశ రాజు అయిన ఆయు ద్వారా నిర్మించబడినది అని తెలుస్తుంది. సూర్యవంశ చక్రవర్తులు పాలించిన కోసల దేశానికి అయోధ్య రాజధాని నగరం. అయోధ్యను రాజధానిగా చేసుకొని హిందువుల దైవమైన శ్రీరాముడు పాలించాడు. స్కంద మరియు ఇతర పురాణాలు భారత దేశంలోని ఏడు మోక్ష పురాలలో అయోధ్య ఒకటని చెప్తున్నాయి. హిందూ పవిత్ర గ్రంథాలలో పురాణాలు ముఖ్యమైనవి. ప్రస్తుతం అయోధ్య చారిత్రాత్మకమైన పవిత్ర ఆలయం అన్న ఒక పుణ్యక్షేత్రం. ప్రతి హిందువు తప్పక చూడాలనుకునే పుణ్యక్షేత్రాలలో అయోధ్య ఒకటి. అధర్వణవేదం ప్రకారం అయోధ్య దైవ నిర్మితమని ఇది స్వర్గ సమానమని పేర్కొంది. అయోధ్యను మొదటిసారిగా సూర్యవంశపు రాజైన వైవసత్వ మనువు కుమారుడైన ఇక్ష్వాకువు నిర్మించి పాలించాడని పురాణకథలు వివరిస్తున్నాయి. ఈ వంశపు వాడైన పృథువు వలన ఈ భూమికి పృథ్వి అనే పేరు వచ్చింది. తరువాత రాజు మాంధాత, సూర్యవంశం లోని 31వ రాజు హరిశ్చంద్రుడు ఆ తరువాత కాలంలో రఘు మహారాజు రాజయ్యాడు . ఈయన పాలన తర్వాత సూర్యవంశం రఘువంశం గా పిలువబడింది. రఘు మహారాజు మనవడు దశరథ మహారాజు. దశరథ మహారాజు కుమారుడు శ్రీ రామచంద్రుడు.
ఇక అతి పురాతన హిందూ నగరాలలో అయోధ్య ఒకటి. రామాయణంలో ఈ నగర వైశాల్యం 250 చ.కి.మీ. గా వర్ణించబడింది. కోసల రాజ్యానికి రాజధాని అయోధ్య . ఇది పతిత పావని అయిన గంగా నదీ తీరంలో, సరయు నది కుడి వైపున ఉంది. వాల్మీకి విరచితమైన వాల్మీకి రామాయణ మహా కావ్యం మొదటి అధ్యాయాలలో అయోధ్య మహోన్నతంగా వర్ణించబడింది. జడభరత, బాహుబలి, సుందరి, పాడలిప్త, సూరిశ్వరి, హరిశ్చంద్ర, అచల, భారత మొదలైన వారు అయోధ్య లో జన్మించినవారే.. మహరాజైన ఆయు పురాణాలలో శ్రీ రాముని పూర్వికుడు గా పేర్కొనబడింది. అతడి పేరు సంస్కృత పదమైన యుధ్ నుండి వచ్చింది. ఆయుధ్ అపరాజితుడు కనుక ఆ నగరానికి అయోధ్య అనే పేరు వచ్చింది. అయోధ్య అంటే జయించశక్యం కానిది అని అర్థం. గౌతమ బుద్దుని కాలంలో ఈ నగరం పాలి భాషలో అయోజ అని పిలువబడింది. అది కూడా సంస్కృతంలో అయోధ్య అనే అర్థం ఇస్తుంది. పురాణాలు గంగా నది గురించి వివరించినపుడు అయోధ్య ప్రస్తావన ఉంది. అయోధ్యలో ఎన్నో చూడ దగ్గ ప్రదేశాలు ఉన్నాయి. ఇక్కడ సరయు నదీ చూడదగ్గ ప్రదేశాలలో ఒకటి.
అయోధ్యలో బిక్షువులు ఉండకూడదన్న ఉద్దేశ్యంతో సాధువులకు ఏర్పాటు చేసిన అన్నదాన సత్రం. ఇక్కడ మహా దాతల సహాయంతో ప్రతి రోజూ సాధువులకు అన్న దానం చేస్తుంటారు. అలాగే ఇక్కడ గోశాలలో 200 కి పైగా గోవులు ఉన్నాయి. ఈ గొక్షీరం ఆశ్రమ నిర్వహణకు ఉపయోగించబడతాయి. శ్రీ రామునికి జన్మ ఇచ్చిన కౌసల్య దేవికి ఇక్కడే ఆలయం నిర్మించబడింది. ఈ ఆలయంలో దశరథుడు, కౌసల్య దేవితో పాటు శ్రీరాముడు ఉండటం విశేషం . ఇక్కడ ఉన్న హనుమాన్ ఆలయంలో నిరంతరం అఖండ భజన కొనసాగుతుంది వాల్మీకి మందిరంలో పాలరాతి గోడల పైన వాల్మీకి రామాయణ లోని 24,000 శ్లోకాలు లిఖించబడి ఉన్నాయి. ఇక్కడ మూల మందిరంలో వాల్మికితో పాటు లవ,కుషులు ఉండడం విశేషం. సీతారామ కళ్యాణం అనంతరం అయోధ్యలో ప్రవేశించిన తరువాత కైకేయి, దశరతులు ఈ మందిరం పెళ్లి కానుకగా సీతారాములకు ఈ భవనం ఇవ్వబడింది అని హిందువుల విశ్వాసం. ప్రస్తుత భవనం విక్రమాదిత్యుడు నిర్మించాడని హిందువులు విశ్వసిస్తున్నారు. విక్రమాదిత్యుడు సరయు నదిలో స్నానమాచరించి అయోధ్య నగరంలొ ప్రవేశించిన తరువాత ఆయనకు అక్కడ గతంలో ఉన్న భావనలు కళ్ళకు కట్టినట్టుగా గోచరమయ్యాయని, తరువాత విక్రమాదిత్యుడు ఇక్కడ ఆలయాలు ,ఆమె భవనాలు నిర్మించబడ్డాయి అని భక్తుల విశ్వాసం.
బాబర్ మసీద్ నిర్మించబడిన ప్రదేశంలో రామజన్మ భూమిలో తాత్కాలికంగా ఒక చిన్న ఆలయంలో పూజాదికాలు జరిగాయి. ఇగ స్వతంత్ర భారత దేశం లో జరిగిన సంఘటనలు విషయానికొస్తే 1984 సంవత్సరం లో బాబ్రీ మసీద్ స్థలాన్ని రామ ఆలయం కోసం తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ఒక ఉద్యమం ప్రారంభించింది. 1992 లో జరిగిన అల్లర్లలో బాబ్రీ మసీద్ కూల్చివేతకు దారి తీసింది. ఆ తరువాత రామజన్మ భూమిలో రాముడు చిన్నపిల్ల వాడిగా వికసించే తామరపువ్వు నవ్వుతున్న విగ్రహం రాంలల్లలో తాత్కాలిక రామ మందిరం ఉండేది. భారత ప్రభుత్వం కింద అధీనంలో ఉన్న 200 గజాల స్తలాం వద్ద ఎవరికి అనుమతి లేదు. అక్కడ ఉన్న ఈ స్థలం వద్ద ద్వారం వెలుపల గేటుకు తాళం వేయబడి ఉంది. అయితే వివాదాస్పద స్థలంకాని ప్రదేశంలో హిందూ యాత్రికులు రాముని పూజ కొరకు మరో వైపు ఉన్న తలుపు ద్వారం గుండా ప్రవేశించడం మొదలుపెట్టారు. 2003 లో భారత పురావస్తు శాఖవారు బాబ్రీ మసీుదు ప్రదేశంలో ఒక ఆలయాన్ని నిర్మూలించి దాని శితిలాలపై ఒక మసీదు నిర్మించబడినదా అనే దానిపై ఒక తవ్వకాన్ని జరిపించింది. తవ్వకం జరిపిన తర్వాత వివిధ రకాల వస్తువులు హనుమంతుని 12 అడుగుల విగ్రహంతో సహా ప్రారంభ చారిత్రక కాలానికి సంబందించిన నాణేలు ఇతర చారిత్రక వస్తువులు లభ్యమయ్యాయి. బాబర్ ఆధ్వర్యంలో బాబ్రీ మసీద్ నిర్మించడానికి పురాతన ఆలయం కూల్చివేయడం లేదా సవరించడం జరిగిందని భారత పురావస్తు శాఖ వారు నిర్థారించారు. హిందువులు మాత్రమే కాకుండా బౌద్ధ, జైన ప్రతినిధులు జరిపిన ప్రదేశంలో వారి దేవాలయాలు ఉన్నాయని పేర్కొన్నారు. తేదీ 9/11/2019 రోజున అయోధ్య తుది తీర్పును వెలువరిస్తు కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. వివాదాస్పద స్థలాన్ని హిందువులకు అప్పగించాలని కోర్టు తీర్పు వెలువరించింది. 2.77 ఎకరాల వివాదాస్పద స్థలాన్ని అయోధ్య ట్రస్టుకు అప్పగించండి, ప్రత్యామ్నయంగా 5 ఎకరాల భూమిని వక్ఫ్ బోర్డుకి ఇవ్వండి. స్థలం స్వాధీనం చేసుకునేందుకు 3నెలల్లో ట్రస్ట్ ఏర్పాటు చేయాలి . అయోధ్య చట్టం కింద 3నెలల్లో మందిర నిర్మాణానికి ట్రస్ట్ ఏర్పాటు చేయండి. ఆ భూమిని ట్రస్ట్ కి అప్పగించండి. ఆలయ నిర్మాణ పనులను ట్రస్ట్ చేపట్టాలని తీర్పులో వెల్లడించింది. అలానే ట్రస్ట్ ఏర్పాటు చేయబడింది . ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. 5 ఆగస్ట్, 2020 రోజు భవ్య రామ మందిర నిర్మాణానికి భూమి పూజ జరిగింది.
హిందువులందరూ మూడున్నర ఏళ్లుగా ఎంతో ఆతృతతో వేచి చూస్తున్న శ్రీ శ్రీ భవ్య రామ మందిరం ప్రారంభోత్సవం రానే వచ్చింది. హిందువుల చిరకాల కోరిక అయిన అయోధ్య రామ మందిరం 22 జనవరి, 2024 రోజు అయోధ్య రామ ప్రారంభం కానుంది.
జై శ్రీ రామ్.. జై హింద్… 🙏🙏🙏🙏🙏