1919 ఏప్రిల్ 13 పంజాబ్ లోని అమృత్సర్లో జలియన్వాలాబాగ్ అనే చిన్న తోటలో రోలర్ చట్టానికి వ్యతిరేకంగా శాంతియుతంగా సభ జరుపుకుంటున్న అమాయక ప్రజలపై జనరల్ డయ్యర్స్ ఆధ్వర్యంలో విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో దాదాపు 1000 మంది మరణించారు. రెండు వేల మంది క్షతగాత్రులైనారు. ఇది అత్యంత ఘోరమైన సంఘటనగా చరిత్రలో మిగిలిపోయింది.
ఆరోజు ఆ సభలో మంచినీరు సరఫరా చేయడానికి ఒక అనాధ శరణాలయం నుండి 19 ఏళ్ల కుర్రాడు ఒకడు వచ్చాడు. జరిగిన దురంతం చూసి చలించిపోయాడు. నేల మీద పరుండి ప్రాణాలు కాపాడుకున్న ఆ కుర్రాడు శవాల గుట్టలను చూసి కోపంతో వణికిపోయాడు. కంటినిండా నీరు ఉబికి వస్తుండగా ఆ తోటలోని రక్తం అంటిన మట్టిని తీసుకొని “ఈ దురంతానికి కారకులైన వ్యక్తులను చంపే దాకా నేను చావను.” అంటూ ప్రతిజ్ఞ చేశాడు..
దీనికి కారకులైన డయర్స్ ను వెతుక్కుంటూ బయలుదేరాడు. తుపాకీ కాల్చడం నేర్చుకున్నాడు. కొన్ని రోజులు భగత్ సింగ్ తో కలిసి విప్లవ కార్యక్రమాలలో పాల్గొన్నారు. డయర్స్ లో ఒకరైన ఫ్రాన్సిస్ డయ్యర్ 1927లో భారత్ లోనే చనిపోయాడు. దానితో జనరల్ O. డయ్యర్ ను చంపడానికి ఇంగ్లాండ్ పయనం అవ్వాలనుకుంటున్న సమయంలో భగత్ సింగ్ తో పాటు ఆయనను అరెస్టు చేశారు. తన కళ్ళముందే భగత్ సింగ్ ను ఉరి తీయడం చూసి హతాసుడైనాడు. 1932లో విడుదలైన తర్వాత ఇంజనీరింగ్ చదవాలని ఇంగ్లాండ్ పయనం అయినాడు. పేరు మార్చుకుంటూ జనరల్ O. డయ్యర్ ను వెంటాడు సాగాడు. దీనికోసం చాలా కష్టాలు పడ్డాడు. ఆకలితో నిద్రలేని ఎన్నో రాత్రులు గడిపారు.
1940 జూలై 31న అతనికి O. డయ్యర్ ఒక కాన్ఫరెన్స్ కు హాజరు కాబోతున్నట్లు సమాచారం అందింది. ఎంతో కష్టపడి ఎంట్రీ పాస్ సంపాదించాడు. ఒక పుస్తకంలో పిస్టల్ పట్టేటట్లు కాగితాలను కత్తిరించి అందులో దాన్ని దాచాడు. ఏమీ ఎరగనట్లు O.డయ్యర్ సభకు వెళ్ళాడు. సభలో O. డయ్యర్ను వీరుడు, ధీరుడు అంటూ పొగిడేస్తున్నారు. అది వింటున్న ఆ యువకుడి రక్తం సలసలలాడ సాగింది. జలియన్వాలాబాగ్లో అమాయకుల ఆర్తనాదాలు గుర్తుకొచ్చాయి. రక్తపు మడుగులో గిలగిల కొట్టుకుంటూ ప్రాణాలు విడుస్తున్న భాగ్యులు గుర్తుకొచ్చారు. ఇంతలో డయ్యర్ ప్రసంగం ముగిసింది. ఆయనను అభినందించడానికి జనాలు ఆయన దగ్గరకు వెళుతున్నారు. ఆ యువకుడు కూడా గంభీరంగా లేచి పుస్తకం చేత పట్టుకొని డయ్యర్ దగ్గరకు వెళుతున్నాడు. నిశితంగా గమనిస్తున్న O. డయ్యర్ ఆ యువకుడి వేషధారణను చూసి ఏదో గుర్తుకొస్తున్నట్లు అనిపించి, అప్రమత్తమయ్యే లోపల పుస్తకంలోని పిస్టల్ మెరుపు వేగంతో తీయడం, అంతే వేగంతో ఓడయ్యర్ పై గుల్ల వర్షం కురిపించడం జరిగిపోయింది. జనరల్ డయ్యర్ నేలకొరిగాడు. జలియన్వాలాబాగ్ కాల్పుల సమయంలో మీరు మా బానిసలు, మీ ప్రాణాలు మేము పెట్టిన భిక్ష అంటూ విర్రవీగాడు డయ్యర్.. కానీ జలియన్వాలాబాగ్ సంఘటనలోని వ్యక్తి చేతిలోనే 21 సంవత్సరాల తర్వాత ప్రాణాలు విడిచాడు.
అయ్యర్ ను చంపిన తర్వాత ఇతనిని చంపడానికినేను ఇన్ని రోజులు బ్రతికాను ఇంక నన్ను ఏమైనా చేసుకోండి అంటూ లొంగిపోయాడు. ఆ యువకుడు ఇంతకీ ఆ యువకుడి పేరు ఏమిటో తెలుసా…” షంషేర్ ఉద్ధం సింగ్”... ఆ విప్లవ వీరుడిని ఉరి తీశారు.
ఉద్ధం సింగ్ పంజాబ్లోని సంగ్రూర్ జిల్లాలోని సునం తహసీల్ కి చెందిన కలన్ గ్రామంలో డిసెంబర్ 26 1899 న సర్దార్ తెహల్ సింగ్, నారాయణ కౌర్ దంపతులకు జన్మించాడు. ఉద్ధం సింగ్ కి ఒక సోదరుడు ముక్తా సింగ్ ఉన్నాడు. దురదృష్టవశాత్తు తల్లిదండ్రుల ప్రేమను సోదరులు ఇద్దరు ఎక్కువ కాలం పొందలేకపోయారు. తండ్రి 191 లో మరణించాడు. మరియు తండ్రి మరణించిన తర్వాత ఆరు సంవత్సరములకు తల్లి కూడా మరణించినది. ఇంత దారుణమైన పరిస్థితులలో సోదరులు ఇద్దరు వేరే దారి లేక అమృత్సర్లోని సిఖ్ ఖల్సా అనాధ ఆశ్రమంలో ఉంటూ విద్యనభ్యసించారు. కానీ దురదృష్టవశాత్తు ఉద్ధం సింగ్ సోదరుడు కూడా ఎక్కువ సంవత్సరాలు కలిసి జీవించలేదు. సోదరుడు ముక్త సింగ్ 1917 లోనే మరణించాడు. పంజాబ్లో స్వాతంత్ర ఉద్యమం పెల్లుబుకున్న సమయంలో ఉద్ధం సింగ్ ఒంటరిగా ఉన్నారు. సిఖ్ జీవనశైలిలో దేశం తప్ప వేరే ధ్యాసే లేకుండా ఉన్నాడు ఉద్ధం సింగ్. ఉద్ధం సింగ్ తన మెట్రిక్ లెవెల్ ను 1918లో పూర్తి చేశాడు. ఆ తర్వాత భారత స్వాతంత్ర్య విప్లవ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటూ దేశం కోసం బలిదానం అయ్యాడు…..
“జోహార్ ఉద్ధం సింగ్”…. జోహార్…
🚩 జై హింద్.. 🚩