గణేశ పూజలో తులసి నిషేధమా??
వినాయక చవితి నాడు అనేక పత్రాలతోనూ పుష్పాలతోనూ పూజిస్తాము. ఆ పత్రాల్లో తులసి ఉండదు. సర్వదేవతలకు పవిత్రమైన తులసి వినాయకుడు ఇష్టపడకపోవటమే దీనికి కారణం. ఓసారి గంగా తీరంలో వినాయకుడు విహరిస్తుండగా ధర్మ ధ్వజ యువరాణి వినాయకుడిని చూసి మోహించి పరిణయము చేసుకోమంది. దానికి వినాయకుడు కాదనడంతో ధర్మ ధ్వజ రాజపుత్రిక కోపించి దీర్ఘకాలం బ్రహ్మచారిగా ఉండమని శపించింది. ప్రతిగా వినాయకుడు ఆమెను రాక్షసుని చెంత దీర్ఘకాలం ఉండమని ప్రతి శాపమిస్తాడు. వినాయకుని శాపానికి చింతించిన ధర్మ ధ్వజ రాకుమార్తె స్వామిని మన్నించమని వేడుకోగా వినాయకుడు శాంతించి రాక్షసుని చెంత కొంతకాలం ఉండి ఆపై పవిత్రమైన తులసిగా జన్మిస్తావు అని చెబుతాడు. అందుకే వినాయకుడు తులసిని తన పూజ పత్రిలో ఇష్టపడడు. కొన్ని ప్రాంతాలలో వినాయకుని తులసీదళాలతో పూజిస్తారు వినాయక చవితి నాడు మాత్రం తులసీదళాలతో పూజించవచ్చు.